బోధన్ పట్టణంలో ఈనెల 27వ తేదీన హోటల్ ను చాంద్ పాషా అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినందుకు పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. హోటల్ నిర్వాహకులైన చాంద్ పాషా కు న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునీ వెల్లడించిందని బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వి. వెంకటనారాయణ తెలిపారు. నిబంధనలను ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని ఎస్ హెచ్ ఓ తెలిపారు.