బోధన్: రిటైర్డ్ పెన్షనర్స్ డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ

66చూసినవారు
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో చేతుల మీదుగా ఆవిష్కరించారు. శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పెన్షనర్ లు సబ్ కలెక్టర్ వికాస్ మహాతోను కలిశారు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సబ్ కలెక్టర్ కు వివరించారు. పోతంగల్ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాన్ని తమకు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్