బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ మహిళా జూనియర్ కళాశాలలో బోధన్ డివిజన్ షీ టీం విజయ్, గౌతమి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించడం జరిగింది. మహిళల భద్రత, మహిళలపై జరుగుతున్న నేరాలు, T- సేఫ్ యాప్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై అవగాహన కలిగించి, భద్రత లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.