చందూరు మండల కేంద్రానికి చెందిన సీపీఎం నాయకులు కోరండ్ల సాయిబాబా అస్తమాతో గురువారం సాయంత్రం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, సీపీఎం నాయకులు శుక్రవారం చందూర్ లో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ కోసం తాను సేవలు మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు