ముప్కాల్ గ్రామంలో ఇండోర్ షెడ్డు నిర్మాణం ప్రారంభం

72చూసినవారు
ముప్కాల్ గ్రామంలో ఇండోర్ షెడ్డు నిర్మాణం ప్రారంభం
ముప్కాల్ మండల కేంద్రంలో ఇండోర్ స్టేడియం షెడ్డు నిర్మాణం పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా రంగ నిపుణులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ నెలలో ఇండోర్ స్టేడియంకు భూమిపూజ చేయడం జరిగింది అన్నారు. స్టేడియం నిర్మాణం కోరకు పలువురు దాతలు ముందుకు రావడంతో షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్