సాలురా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంఘ చైర్మన్ అల్లె జనార్ధన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంఘ సభ్యులు, రైతులు ప్రజలు, విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మిఠాయిలను పంచిపెట్టారు. సంఘ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, రైతులు, కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.