నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన గురువారం ఉదయం ఈ చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.