డివిజన్ స్థాయిలో టీకా తీసుకొన్న తొలి వ్యక్తి ఏఆర్పి క్యాంప్ వాసి

850చూసినవారు
డివిజన్ స్థాయిలో టీకా తీసుకొన్న తొలి వ్యక్తి ఏఆర్పి క్యాంప్ వాసి
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యురిటి గార్డ్ గా పని చేస్తున్న మహేందర్ ఏఆర్పి క్యాంప్ కు చెందిన వ్యక్తి శనివారం కోవిడ్ టీకా తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ ని అంతు చూసేందుకు టీకా తయారు చేశారు. డివిజన్ టీకా స్థాయిలో టీకా తీసుకొన్న తొలి వ్యక్తిగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. టీకా తీసుకొన్న అనంతరం తనకు ఎలాంటి ఇబ్బంది రాలేదని తెలిపారు. టీకా విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. వ్యాక్సిన్ కని పెట్టిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్