చందూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని బోధన్ ఆర్డీఓ వివేక్ మెహత శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తప్పిదాలకు తావులేకుండా పక్కాగా ఇంటింటి సర్వే ఇళ్ల జాబితా రూపకల్పన ప్రక్రియ పరిశీలనను మండలంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించాలని సూచించారు.