కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం గ్రామ శివారులోని మైసమ్మ చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకి తీసి కేసు నమోదు చేసి ఆసుపత్రికి తరలించారు.