మొక్కలు నాటి సంరక్షించాలి: కలెక్టర్

69చూసినవారు
మొక్కలు నాటి సంరక్షించాలి: కలెక్టర్
స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విస్తృతంగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రత, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. మంగళవారం రాజంపేట మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్చత హీ సేవా కార్యక్రమం క్రింద పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో కలెక్టర్ మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్