మోస్రా మండల గ్రామాల బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు
మోస్రా మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను మోస్రా నాయకులతో కలిసి బాధితులకు అందజేశారు. మోస్రాలో ఒక్కరికి, గోవూర్ లో ముగ్గురికి, చింతకుంటలో ఒకరికి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోస్రా రైతు సమన్వయ అధ్యక్షులు పిట్ల శ్రీ రాములు, హన్మంత్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.