నవీపేట్ మండల కేంద్రంలో ఘనంగా దసరా వేడుకలు
నవీపేట్ లో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి మహిళలు హారతులు ఇచ్చి సాయంకాలం మంగళ వాయిద్యాల మధ్య వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు మూర్తి పల్లకిలో వెంకటేశ్వర స్వామి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.