నవీపేట్ మండల కేంద్రంలోని: శ్రీ జై భవాని 15వ వార్షిక శరన్నావరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు సరస్వతి దేవి అవతారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని కమలం పువ్వు, పలకలు, అక్షరాలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునీ నవీపేట్ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.