Mar 27, 2025, 09:03 IST/
ALERT: తెలంగాణలోని ఆ జిల్లాలో పెద్దపులి కలకలం
Mar 27, 2025, 09:03 IST
ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వెంకటాపూర్(M) లింగాపురం అటవీ ప్రాంతం నుంచి 163 జాతీయ రహదారిని మగపులి దాటడాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. బుధవారం వరకు భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించిన పులి, ములుగు వైపు వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు పెద్దపులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు.