నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా శుక్రవారం బూత్ లెవల్ అధికారులు చేస్తున్న సర్వేను మునిసిపల్ కమిషనర్ మకరంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారిన వారు తప్పకుండా అడ్రస్ మార్చుకోవాలని సూచించారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని తెలియజేశారు.