నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆదివారం ఆర్డీవో రాజేశ్వర్ పరిశీలించారు. అనంతరం కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించి సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల ప్రత్యేక అధికారి గోవింద్, ఎమ్మార్వో రామేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి సురేశ్, గ్రామస్థులు పాల్గొన్నారు.