పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో పలు ప్రభుత్వ గురుకుల పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను మంగళవారం తల్లిదండ్రులు వెళ్లి తమ పిల్లలను ఇండ్లకు తీసుకువచ్చారు. పాఠశాల చివరి రోజు కావడంతోపేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పలు పాఠశాల ల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించి ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సెలవులకు ఇండ్లకు పయనమయ్యారు.