ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 30 క్లినిక్‌ల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం మంగళవారం తనిఖీలు చేపట్టింది. నకిలీ డిగ్రీతో ఎలాంటి విద్యార్హత లేకుండా ఆధునిక వైద్యం చేస్తున్న 15 మంది నకిలీ డాక్టర్లను గుర్తించినట్లు వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. విచ్చలవిడిగా యాంటీబయటిక్ స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. వారిపై నేషన్ల్ మెడికల్ కమిషన్ చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు.