చందూర్ మండల కేంద్రంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కాసుల బాలరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన పరుచూరి చంద్రావతి దంపతులను, దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మెహత, తహశీల్దార్ శాంత, ఎంపీడీఓ నీలావతి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.