నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ మంగళవారం తెలిపారు. ఇప్పటికే ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని వివరించారు.