నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు గుంతలో దిగబడింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. గతంలో ఈ ప్రదేశంలో నగరపాలక సంస్థ సిబ్బంది భారీ గుంతను తీసి పూడ్చి వేశారు. అయితే గుంత సరిగ్గా పూడ్చకపోవడంతో బస్సు ఆ గుంతలో దిగబడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని శుక్రవారం బస్సును బయటకు తీశారు.