సెప్టెంబర్ 17 విశ్వకర్మ భగవానుడి యజ్ఞమహోత్సవం పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ బి. సి శాఖా కార్యాలయంలో నిర్వహించిన విశ్వకర్మ భగవానుడి పూజా మహోత్సవంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చేతులమీదుగా మంగళవారం పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు తంగళ్ళపల్లి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి-లక్ష్మీ నర్సయ్య, జిల్లా సభ్యులు మరియు విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.