రేపు నిజామాబాద్‌లో మీ సేవలు బంద్

60చూసినవారు
రేపు నిజామాబాద్‌లో మీ సేవలు బంద్
నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో మీసేవ కేంద్రాలు స్వచ్చందంగా బంద్ ఉండనున్నట్లు జిల్లా మీసేవ అసోసియేషన్ అధ్యక్షులు చందుపట్ల శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మీ సేవలు ప్రారంభించిన 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్ లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్