గోర్గల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ పరిధిలోని గోర్గల్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ కొనుగోలు తూకానికి కొబ్బరికాయ కొట్టి ధాన్యం బస్తా పెట్టి ప్రారంభించారు. రైతులందరూ సొసైటీ ద్వారానే ధాన్యాన్ని విక్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సి డి సి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.