AP: ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రాత్రి భత్యం రూ.150 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 గంటలకుపైగా రాత్రి సర్వీసులో విధులకు వెళ్లే సిబ్బందికి రోజుకు రూ.150 చొప్పున జీతంతో పాటు చెల్లించనున్నారు. దీని వల్ల నిత్యం రాత్రి సర్వీసుల్లో వెళ్లే 3 వేల డ్రైవర్లు, కండక్టర్లకు మేలు చేకూరనుంది. కాగా, 2022లో పీఆర్‌సీ అమలైనప్పటి నుంచి రాత్రి భత్యం బకాయిలు చెల్లించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కోరింది.