తాడ్వాయి మండలం - Tadwai

పెళ్లైన నాలుగు నెలలకే నవ వధువు మృతి

పెళ్లైన నాలుగు నెలలకే నవ వధువు మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం బ్రాహ్మజీవాడి గ్రామంలో మంగళవారం నవ వధువు మృతి చెందింది. గ్రామానికి చెందిన అర్చన (24) నాలుగు నెలల క్రితం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన రవితేజ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే అత్తారింట్లో వేధింపులు తాళలేక మరోవైపు అరోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో అర్చన తల్లి గారి ఇంటి దగ్గర ఉంటుంది. తల్లిదండ్రులు అర్చన ఆస్పత్రిలో చేర్పించారు. కాగా ఆరోగ్యం క్షీణించగా.. ప్రేమించిన భర్త చూసేందుకు ఎంతగానో ఆరాటపడింది. అయితే తన భర్త ఎంతకు రాకపోవడంతో మనోవేదనకు గురైన అర్చన తల్లి ఇంటి వద్ద మృతి చెందింది.

నిజామాబాద్ జిల్లా