పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
By Rajendernath 85చూసినవారుపాఠశాలల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ హెచ్ఎంలకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర, జేబిఎస్ పాఠశాలలను ఆర్డీఓ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజుతో కలిసి సందర్శించారు. పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఉపాద్యాయులు ప్రార్థన వేళలో విధిగా హాజరు కావాలని, ఉపాద్యాయులు తప్పకుండా సమయ పాలన పాటించాలన్నారు.