తన భర్తను చోరీ కేసులో పోలీసులు తీసుకెళ్లడంతో అవమానంగా భావించిన మౌనిక కూతుళ్లను చంపి, ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మౌనిక తల్లిదండ్రులు కడసారి కూతురిని చూసేందుకు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లారు. బాజీ మాయమాటలు చెప్పి తమ కూతురిని వలలో వేసుకున్నాడని, పెళ్లి వద్దని చెప్పినా వినలేదని కన్నీటిపర్యంతమయ్యారు. తమ కూతురిలా ఏ అమ్మాయి మోసపోవద్దని ఆవేదన చెందారు. కాగా ఎంటెక్ చదివిన మౌనిక ఆరేళ్ల కింద రైలులో పరిచయమైన బాజీని మతాంతర వివాహం చేసుకుంది.