ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. రేపు అసెంబ్లీకి వైసీపీ అధినేత జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లనున్నట్లు సమాచారం. అందుకోసం జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ముందుగా అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు.