పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: స్వాతి మలివాల్‌

80చూసినవారు
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: స్వాతి మలివాల్‌
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ తనపై దాడి చేశాడని కేసు పెట్టిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలీవాల్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ‘వాళ్లకు ఎంపీ సీటు కావాలంటే నన్ను అడిగి ఉండాల్సింది. కావాలంటే నా ప్రాణాలైనా ఇచ్చుండేదాన్ని. నేను ఏ రోజూ పదవుల కోసం ఆశపడలేదు’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్