ఠాగూర్ రచించిన గీతాంజలికి నోబెల్ బహుమతి

61చూసినవారు
ఠాగూర్ రచించిన గీతాంజలికి నోబెల్ బహుమతి
రవీంద్రనాథ్ ఠాగూర్ బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు, విమర్శలు ప్రచురించాడు. ఆయన రచనలలో గీతాంజలి చాలా గొప్పది. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. 1913లో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్