ఉత్తర కొరియా తన ఈశాన్య నగరమైన సంజియోను డిసెంబర్ నుంచి అంతర్జాతీయ పర్యాటకాన్ని తిరిగి ప్రారంభిస్తుందని టూర్ కంపెనీలు తెలిపాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా టూరిజం పునఃప్రారంభం అవుతుందని బీజింగ్ కు చెందిన కొరియో టూర్స్ తెలిపింది. 2020 నుంచి ఉత్తర కొరియా అంతర్జాతీయ పర్యాటకులపై ఆంక్షలు విధించింది. కరోనా నియంత్రణలో భాగంగా సరిహద్దుల గుండా ప్రవేశాలను నిషేధించింది.