BRS పార్టీ B-RSSగా మారిందని CM రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బుధవారం జరిగిన AICC హెడ్ క్వార్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం హాజరై మాట్లాడారు. 'BRS, బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉంది. RSS అడుగుజాడల్లో వెళ్లేందుకు BRS ప్రయత్నిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్‌పై బీజేపీ ఏ ఆరోపణలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌పై BRS అవే ఆరోపణలు చేస్తుంది. BRS నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు' అని అన్నారు.