టీచర్స్ డే రోజున ఓ ఉపాధ్యాయురాలు స్కూల్ ఆవరణలో భోజ్‌పురి పాటకు స్టెప్పులేశారు. 1.30 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో టీచర్ డ్యాన్స్ చేస్తూ ఉండగా.. అక్కడ కొందరు విద్యార్థులు కూర్చొని ఉన్నారు. విద్యార్థులు ఈలలతో జోష్ నింపుతుంటే.. టీచర్ ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. గురువు స్థానంలో ఉండి, పిల్లలకు నేర్పే బుద్దులు ఇవేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.