విద్యార్థులకు గమనిక.. ‘దోస్త్‌’ ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పులు

71చూసినవారు
విద్యార్థులకు గమనిక.. ‘దోస్త్‌’ ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పులు
తెలంగాణలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) స్పెషల్‌ డ్రైవ్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. అర్హ‌త గ‌ల‌ విద్యార్థులు రూ.400 చెల్లించి ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 11 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ నెల 10న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపడతారు. ఈ నెల 12న సీట్లను కేటాయిస్తారు. సీట్లు వచ్చిన వారు ఈ నెల 16 వరకు రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్