ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్‌

50చూసినవారు
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్‌
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ కొత్త సేవల్ని ప్రారంభించింది. ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల భాగస్వామ్యంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయొచ్చని తెలిపింది. దీనికి అత్యధికంగా ఏడాదికి 9.1 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. కొత్తగా బ్యాంక్‌ ఖాతా తెరవకుండానే ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బుక్‌ చేయొచ్చు.

సంబంధిత పోస్ట్