ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మల్లారెడ్డి (వీడియో)

68చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఏపీ భారీ వర్షాలపై ఆయన స్పందిస్తూ... విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయని.. వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. వరద నీటిలో 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. తన అనుభవంతో విపత్తు నుంచి ప్రజలను కాపాడారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్