మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. మెహగావ్ జిల్లా భింద్‌కు చెందిన రవి ధనుక్, విశాల్ ధనుక్‌లు సోదరులు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఆమెకు ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు దొంగలుగా అవతారం ఎత్తారు. పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. నగదు, బంగారం, వెండి, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లే వారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు.