తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. సికింద్రాబాద్ - నాగ్‌పుర్ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్ రైలు సర్వీసులంచేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం అధికారికంగా వెల్లడించారు. కాగా, తెలంగాణలో ఇప్పటికే నాలుగు వందేభారత్ రైళ్లు సేవలందిస్తుండగా.. ఇది ఐదో రైలు.