న్యూఢిల్లిలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 60 % మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. ఎస్సీ/ఎస్టీ/ మాజీ సైనికోద్యోగులు/ మహిళలు మినహా మిగతా వారు రూ.300 చెల్లించి ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.ntpc.co.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.