జపాన్ భూకంపంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎన్టీఆర్

581చూసినవారు
జపాన్ భూకంపంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎన్టీఆర్
కుటుంబంతో కలిసి జపాన్‌ పర్యటనకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇందుకు గల కారణం జపాన్ లో తీవ్ర భూకంపం సంభవించడమే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత బయలుదేరి వచ్చేశాడు. అయితే జపాన్ లో సంభవించిన భారీ భూకంపంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ‘‘భూకంప ప్రభావిత వ్యక్తులందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నాను. జపాన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. దృఢంగా ఉండు జపాన్’’ అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్