స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. అయితే ఎన్టీఆర్-నీట్ షూట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం వీరిద్దరూ రిలాక్స్ అవుతూ కనిపించారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటుండగా ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత ఫోటో తీసి ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.