చంద్రబాబుకు ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు

1065చూసినవారు
చంద్రబాబుకు ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు
ఏపీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… నారా లోకేష్‌కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్‌, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్