పిఠాపురం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు: వెంకటేశ్‌

75చూసినవారు
పిఠాపురం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు: వెంకటేశ్‌
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందడంపై సినీ నటుడు వెంకటేశ్ స్పందించారు. ‘‘చారిత్రక విజయం సాధించిన ప్రియమైన పవన్‌కళ్యాణ్‌కు శుభాకాంక్షలు. ఈ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి. ఇదే ఉత్సాహంతో ఉన్నతస్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా. కష్టపడేతత్వం, మనోబలం, నిబద్ధతతో స్ఫూర్తిని నింపుతూ ప్రజలకు మరింత సేవ చేస్తావని ఆశిస్తున్నా. పిఠాపురం ఎమ్మెల్యేగారికి మరోసారి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’ అని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

సంబంధిత పోస్ట్