అణ్వస్త్ర దాడులు.. 1,29,000 మంది మరణం

65చూసినవారు
అణ్వస్త్ర దాడులు.. 1,29,000 మంది మరణం
హిరోషిమానాగసాకిపై 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన అణుబాంబు దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. రెండు నుండి నాలుగు నెలల్లోపున హిరోషిమాలో 90,000 నుండి146,000 మంది వరకు, నాగసాకిలో 39,000 నుండి 80,000 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు సగం మంది మొదటిరోజునే మరణించారు. ఆ తరువాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్ సిక్‌నెస్ వలన, ఇతర గాయాల వలనా, పౌష్టికాహార లోపంతో కూడి అనేక మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువమంది సాధారణ పౌరులే.

సంబంధిత పోస్ట్