ఆయిల్‌ ఇండియా బంపర్ ఆఫర్

83చూసినవారు
ఆయిల్‌ ఇండియా బంపర్ ఆఫర్
ఆయిల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.2,332.94 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,979.74 కోట్లతో పోలిస్తే ఇది 18% ఎక్కువ. మొత్తం టర్నోవర్‌ 16% వృద్ధితో రూ.10,375.09 కోట్లకు చేరింది. కాగా ప్రతి రెండు షేర్లకు బోనస్‌గా ఒక షేరు (1:2 నిష్పత్తిలో) ఇవ్వడానికి బోర్డు ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.3.75 తుది డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్