పారిస్ ఒలింపిక్స్ లో కొవిడ్-19 కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు WHO రిపోర్టుల్లో తేలింది. బ్రిటిష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ, ఆస్ట్రేలియా రన్నర్ లానీ పాలిస్టర్ తదితరులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఒలింపిక్స్ ముగింపునకు మరికొన్ని రోజులు ఉండటంతో కేసుల సంఖ్య పెరగొచ్చని WHO అంచనా వేస్తోంది.