అమెరికాలో తొలిసారి 1904లో జరిగిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్‌కు తాజా వేలంలో రూ.4.72 కోట్లు (5,45,371 డాలర్లు) పలికింది. ఈ పతకానికి ఓవైపున ‘ఒలింపియాడ్, 1904’ అనే అక్షరాలతోపాటు విజేతగా నిలిచిన అథ్లెట్ పూలదండ పట్టుకొన్న బొమ్మ ఉంది. మరోవైపు పురాతన గ్రీకు పురాణాల్లోని విజయ దేవత నైక్‌తోపాటు దేవతల రాజు అయిన జ్యూస్ బొమ్మను చిత్రించారు. అమెరికాకు చెందిన క్రీడాకారుడు ఫ్రెడ్ షుల్‌కు ఈ పతకాన్ని ప్రదానం చేశారు.