చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ అమోలెడ్ డిస్‌ప్లే ఫోన్లలో తలెత్తుతున్న గ్రీన్‌లైన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకమైన గ్రీన్‌లైన్ వర్రీ ఫ్రీ సొల్యూషన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియాలోని వన్‌ప్లస్ యూజర్లకు లైఫ్‌టైమ్ వారంటీని అందించనుంది. కాగా జనవరిలో వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకోవడం విశేషం.